Kota: కోటాలో వరుస ఆత్మహత్యలు.. మరో విద్యార్థి బలవన్మరణం

వివిధ పోటీపరీక్షల కోచింగ్‌ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన ‘కోటా’(Kota)లో.. పొరుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది విద్యార్థులు వచ్చి శిక్షణ పొందుతారు. ఈ క్రమంలో అక్కడ చోటుచేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 

Updated : 19 Oct 2023 12:48 IST

కోటా: రాజస్థాన్‌(Rajasthan)లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు (Kota Suicides) కలవరపెడుతున్నాయి. మంగళవారం రాత్రి ఐఐటీ జేఈఈకి సిద్ధమవుతోన్న మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 20కి చేరింది. ఈ నెలలో ఇది నాలుగోది కావడం ఆందోళన కలిగించే అంశం.

బిహార్‌(Bihar)లోని గయ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల వాల్మీకి జాంగిడ్‌.. ఇంజినీరింగ్ ప్రవేశపరీక్షకు సిద్ధమవుతున్నాడు. దానికోసం గత ఏడాది కోటా(Kota)లోని శిక్షణాకేంద్రంలో చేరాడు. ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతోన్న అతడు.. మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతడి మృతికి గత కారణాలు తెలియాల్సి ఉంది. వివిధ పోటీపరీక్షల కోచింగ్‌ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన ‘కోటా’(Kota)లో.. పొరుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది విద్యార్థులు వచ్చి శిక్షణ పొందుతారు. ఈ ఏడాది దాదాపు 2.5లక్షల మంది అక్కడ శిక్షణ తీసుకుంటున్నట్లు అంచనా. ఈ క్రమంలోనే అక్కడ విద్యార్థుల ఆత్మహత్యలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 

అంధుడైన గురువును హేళన చేస్తూ రీల్‌.. విద్యార్థుల సస్పెన్షన్‌

గతేడాది 15 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడగా.. ఈ ఏడాది ఇప్పటికే ఆ సంఖ్య 20కి చేరడం గమనార్హం. అంతకుముందు కూడా పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. వీటితోపాటు అనేక ఘటనల్లో విద్యార్థులు ఆత్మహత్యకు యత్నించిన సందర్భాలూ ఉన్నాయి. అయితే, ఒత్తిడితోనే ఇలా బలవన్మరణానికి పాల్పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఆత్మహత్యలు తగ్గించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. కోటాలోని విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని