భారత్‌ నుంచి దిగుమతులపై పాక్‌ యూటర్న్‌

భారత్‌ నుంచి చక్కెర, పత్తిని దిగుమతి చేసుకోవాలన్న నిర్ణయంపై పాక్‌ యూటర్న్‌ తీసుకుంది. దిగుమతులు పునరుద్ధరిస్తామన్న ప్రకటించిన మరుసటి రోజే నిర్ణయం మార్చుకోవడం గమనార్హం. 2019 ఆగస్టులో జమ్ము-కశ్మీర్‌కు.

Updated : 24 Sep 2022 16:36 IST

ఇస్లామాబాద్‌: భారత్‌ నుంచి చక్కెర, పత్తిని దిగుమతి చేసుకోవాలన్న నిర్ణయంపై పాక్‌ యూటర్న్‌ తీసుకుంది. దిగుమతులు పునరుద్ధరిస్తామన్న ప్రకటించిన మరుసటి రోజే నిర్ణయం మార్చుకోవడం గమనార్హం. 2019 ఆగస్టులో జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడంతో భారత్‌, పాక్‌ మధ్య వ్యాపార సంబంధాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే రాబోయే రంజాన్‌ నెలను పురస్కరించుకుని చక్కెర, పత్తి, గోధుమలను దిగుమతి చేసుకోవాలని ఆ దేశం నిర్ణయించింది.

ఈ మేరకు ఆ దేశ ఆర్థిక మంత్రి హమ్మద్‌ అజహర్‌ గురువారం ప్రకటన చేశారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం ప్రకటించిన మరుసటి రోజే దిగుమతుల అంశంపై ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్‌ రషీద్‌ అహ్మద్‌ మరో ప్రకటన చేశారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరించేంత వరకూ తమ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. పాక్‌ నిర్ణయంలో మార్పు వెనుక రాజకీయంగా విమర్శలు ఎదుర్కోవడమే కారణంగా తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని