India - Bangladesh: కొన్ని దశాబ్దాలుగా చేయలేని పనులు.. గత 9 ఏళ్లలో చేశాం: ప్రధాని మోదీ

భారత్‌ - బంగ్లాదేశ్‌లు కొన్ని దశాబ్దాలుగా చేయలేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను గత 9 ఏళ్లలో చేశాయని ప్రధాని మోదీ అన్నారు.

Published : 01 Nov 2023 13:44 IST

దిల్లీ: కొన్ని దశాబ్దాలుగా చేయలేని ఎన్నో పనులను భారత్‌ - బంగ్లాదేశ్‌లు గత 9 ఏళ్లలో చేశాయని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఇరు దేశాల మధ్య సహకారం కొత్త శిఖరాలకు చేరుకుందని తెలిపారు. భారత్‌ సహకారంతో బంగ్లాదేశ్‌లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ బుధవారం బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్ హసీనాతో కలిసి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ‘‘భారత్‌ - బంగ్లాదేశ్‌ల మధ్య సహకారం విజయవంతమైంది. కొన్ని దశాబ్దాలుగా చేయలేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను గత 9 ఏళ్లలో ఇరు దేశాలు కలిసి చేశాయి. ఇది ఎంతో సంతోషించదగిన విషయం’’ అని ప్రధాని అన్నారు.

భారత్‌ సహకారంతో బంగ్లాదేశ్‌ పూర్తి చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో అఖౌరా - అగర్తలా క్రాస్‌ బోర్డర్‌ రైలు లింక్‌, ఖుల్నా - మొంగ్లా పోర్ట్‌ రైలు లైన్‌, మైత్రి సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అఖౌరా - అగర్తలా క్రాస్‌ బోర్డర్‌ రైలు లింక్‌ ప్రాజెక్ట్‌ పొడవు 12.24 కి.మీ. భారత్‌లో 6.78 కి.మీ, బంగ్లాదేశ్‌లో 5.46 కి.మీ మేర దీని నిర్మాణం జరిగింది. భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 392.52 కోట్లు ఖర్చు చేసింది. 

విపక్ష ఎంపీలను ఎవరో ఆట పట్టించారనుకుంటా..: హ్యాకింగ్ వివాదంపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు

ఖుల్నా - మొంగ్లా పోర్ట్‌ రైలు లైన్‌ ప్రాజెక్ట్‌ వ్యయం 388.92 మిలియన్ డాలర్లు . ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఖుల్నా రైల్వే నెట్‌వర్క్‌ను బంగ్లాదేశ్‌లో రెండో అతిపెద్ద ఓడరేవు మొంగ్లా వరకు పొడిగించారు. దీని పొడవు 65 కి.మీ. ఇక మైత్రి సూపర్‌ థర్మల్ పవర్‌ ప్రాజెక్ట్‌ ద్వారా బంగ్లాదేశ్‌లోని ఖుల్నా డివిజన్‌లో ఉన్న రామ్‌పాల్‌ వద్ద 1320 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్‌ప్లాంట్‌ను నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను బంగ్లాదేశ్‌-ఇండియా ఫ్రెండ్‌షిప్ పవర్‌ కంపెనీ లిమిటెడ్ (BIFPCL) చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని