Pm kisan: రైతులకు ‘పీఎం-కిసాన్‌’ నిధులు విడుదల చేసిన ప్రధాని

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) పథకం కింద దేశ వ్యాప్తంగా 10.9కోట్ల మంది రైతులకు (100మిలియన్‌) 10వ విడత ఆర్థిక సాయంగా  ప్రధాన..

Published : 01 Jan 2022 16:08 IST

దిల్లీ: ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌) పథకం కింద దేశ వ్యాప్తంగా 10.9కోట్ల మంది రైతులకు (100మిలియన్‌) 10వ విడత ఆర్థిక సాయంగా రూ.20,900 కోట్లకు పైగా నిధులను విడుదల చేశారు. పీఎం కిసాన్‌ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ.6,000 అందిస్తుండగా ఏటా మూడు వాయిదా పద్ధతుల్లో రూ.2వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన సమావేశంలో ప్రధాని లబ్దిదారులకు నగదు విడుదల చేశారు. పీఎం కిసాన్‌ నిధులతో పాటు 351 వ్యవసాయ ఉత్పత్తిదారుల సంస్థలకు (ఎఫ్‌పీవో)లకు రూ.14 కోట్లు విడుదల చేశారు. దీని ద్వారా 1.24లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. వీసీ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, వ్యవసాయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ మాట్లాడుతూ.. 2022 నూతన సంవత్సరం మొదటి రోజున దాదాపు 10.9 కోట్ల మంది లబ్దిదారులకు రూ.20,900 కోట్లు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రైతులకు లబ్ది చేకూర్చాలన్న ఉద్దేశంతో పీఎం కిసాన్‌ అమలు చేస్తున్నట్లు తెలిపారు. 9వ విడత పీఎం కిసాన్‌ నిధులు గడిచిన ఆగస్ట్‌ నెలలో విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని