modi: నేటి సాయంత్రంప్రధాని కీలక భేటీ..

దేశంలోని కొవిడ్‌ పరిస్థితిపై నేటి సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీ నిర్వహించనున్నట్లు సమాచారం. గత కొన్నాళ్లుగా దేశంలో కొవిడ్‌ కేసులు విపరీతంగా

Published : 09 Jan 2022 12:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో కొవిడ్‌ పరిస్థితిపై నేటి సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీ నిర్వహించనున్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా దేశంలో కొవిడ్‌ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని సమీక్షించనున్నారు. కొవిడ్‌పై డిసెంబర్‌ 24న ప్రధాని చివరిసారి భేటీ నిర్వహించారు. థర్డ్‌వేవ్‌ వస్తోన్న సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ఆ తర్వాత నుంచి దేశంలో కొత్త కేసులు రోజుకు లక్షకుపైగా నమోదవుతున్నాయి. ఇక క్రియాశీల కేసులు ఆరు లక్షలకు చేరుకున్నాయి. ఈ క్రమంలో వేల సంఖ్యలో డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది కూడా కొవిడ్‌బారిన పడ్డారు. ఈ క్రమంలో యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగార మోగడంతో తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించే అవకాశం ఉంది.  

గడిచిన 24 గంటల్లో 1.60 లక్షల కొత్త కేసులు వెలుగులోకి రావడం వైరస్‌ తీవ్రతను తెలియజేస్తోంది. ఇక పాజిటివిటీ రేటు 10.21 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. మరోమైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని