Gujarath: స్తంభానికి కట్టి..చితక్కొట్టిన పోలీసులు..వీడియో వైరల్‌!

దసరా నవరాత్రుల సందర్భంగా మహిళలు, చిన్నారులంతా కలిసి గార్బా ఆడుతుండగా.. కొందరు ఆకతాయిలు వాళ్లపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితులను పట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే కరెంటు స్తంభానికి కట్టి చితక్కొట్టారు. ఈ ఘటన గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో జరిగింది.

Published : 05 Oct 2022 02:04 IST

అహ్మదాబాద్‌: దసరా నవరాత్రుల సందర్భంగా మహిళలు, చిన్నారులంతా కలిసి గార్బా ఆడుతుండగా.. కొందరు ఆకతాయిలు వాళ్లపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితులను పట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే కరెంటు స్తంభానికి కట్టి చితక్కొట్టారు. ఈ ఘటన గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను భాజపా కార్యకర్తతో పాటు స్థానిక మీడియా కూడా సామాజిక మాద్యమాల్లో పోస్టు చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఆకతాయిలను కొడుతున్న సమయంలో పోలీసులు యూనిఫాంలో లేరు. అయితే అక్కడున్న ఇన్‌స్పెక్టర్‌ దగ్గర రివాల్వర్‌ను వీడియోలో చూడొచ్చు. దేహశుద్ధి తర్వాత నిందితులు అక్కడున్న వారికి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. మహిళలంతా ఒక్కచోట చేరి గార్బా నృత్యం చేస్తుండగా దాదాపు 150 మంది ఆకతాయిలు వాళ్లపై రాళ్లు రువ్వినట్లు పీటీఐ వార్త సంస్థ తెలిపింది. 43 మందిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ బాజ్‌పేయి తెలిపారు. వీరిలో 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. హిందూయేతర వర్గానికి చెందిన చెందిన ఇద్దరు వ్యక్తులు వేడుకల్లో ప్రవేశించి సమస్యను సృష్టించారని ఖేడా ఎస్పీ రాజేశ్‌ గధియా తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని