Maldives: మాల్దీవులకు ఎందుకు అంత చెల్లిస్తారో..?: ఎడెల్‌వీస్‌ సీఈఓ రాధిక గుప్తా

ప్రధాని మోదీ(Modi) ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన నేపథ్యంలో మాల్దీవుల(Maldives) నేతలు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై పలువురు స్పందిస్తున్నారు. 

Updated : 11 Jan 2024 14:03 IST

దిల్లీ: భారత్‌-మాల్దీవుల వివాదంపై మన దేశ ప్రముఖులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎడెల్‌వీస్‌ సీఈఓ రాధిక గుప్తా( Radhika Gupta) ఎక్స్‌లో పోస్టు పెట్టారు. మన దేశంలో పర్యాటక ప్రాంతాలు ఉండగా.. మాల్దీవుల(Maldives) పర్యటన కోసం ప్రజలు అంతమొత్తం ఎందుకు చెల్లిస్తారో..? అని ప్రశ్నించారు.

‘మన పర్యాటక రంగ సమర్థతపై నాకు నమ్మకం ఉంది. మనకు లక్షద్వీప్‌, అండమాన్‌ వంటి ప్రాంతాలు ఉండగా.. మాల్దీవులకు ఎందుకు వెళ్లాల్సి వస్తుందని ఎప్పుడూ ఆలోచిస్తుంటా..? దానికి సమాధానమే  1. మౌలిక సదుపాయాలు 2. మార్కెటింగ్‌. ఇటీవలి మోదీ పర్యటన ఈ ప్రాంతాలపై దృష్టిసారించేలా చేసింది. మరెక్కడా లేని విధంగా లగ్జరీని అందించడం ఎలాగో మన హోటల్ బ్రాండ్‌లకు తెలుసు. ప్రపంచస్థాయి టూరిజం అనుభవాన్ని అందించడం కోసం భారత ఆతిథ్యాన్ని మరింత మెరుగుపర్చుకుందాం’ అని ఎడెల్‌వీస్‌ సీఈఓ రాధిక గుప్తా సూచించారు.

లక్షద్వీప్‌తో మాల్దీవులకు సమస్య ఏంటీ: ఎంపీ

భారత్‌కు వ్యతిరేకంగా మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్లపై నెటిజన్లు బాయ్‌కాట్ ట్రెండ్ మొదలుపెట్టారు. క్రికెటర్లు, సినీ, వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులు ఎక్స్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లో ఉన్న పర్యాటక ప్రాంతాల చిత్రాలను షేర్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ తమ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని మాల్దీవుల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని