రాహుల్‌ బస్కీలు.. ప్రియాంక డ్యాన్స్‌

మరికొద్ది రోజుల్లో జరగనున్న నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీ మనుగడకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. దీంతో ఈ ఎన్నికలపై హస్తం పార్టీ గట్టిగా దృష్టిపెట్టింది

Published : 01 Mar 2021 17:33 IST

ఎన్నికల ప్రచారంలో అన్నాచెల్లెళ్లు బిజీబిజీ

చెన్నై/గువాహటి: మరికొద్ది రోజుల్లో జరగనున్న నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీ మనుగడకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. దీంతో ఈ ఎన్నికలపై హస్తం పార్టీ గట్టిగా దృష్టిపెట్టింది. ముఖ్యంగా అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎన్నికల జరిగే రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తుండగా.. తాజాగా సోదరి ప్రియాంక గాంధీ కూడా ప్రచార బరిలో దిగారు. ప్రచారంలో భాగంగా ప్రజలతో కలిసి ఆడిపాడుతూ వారికి చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. 

కన్యాకుమారిలో రాహుల్‌ బస్కీలు

రాహుల్‌గాంధీ నేడు తమిళనాడులోని కన్యాకుమారిలో పర్యటించారు. ములగుమూడుబన్‌ ప్రాంతంలోని సెయింట్‌ జోసఫ్‌ పాఠశాల విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని తనతో పాటు పుషప్స్‌ చేస్తారా అని అడగ్గా.. రాహుల్‌ అందుకు ఒప్పుకున్నారు. విద్యార్థిని కంటే వేగంగా బస్కీలు తీసి ఆకట్టుకున్నారు. ఈ వీడియోను రాహుల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అంతకుముందు ఇక్కడి విద్యార్థులతో కలిసి రాహుల్‌ కాసేపు సరదాగా డ్యాన్స్‌ చేశారు.

మహిళలతో ప్రియాంక నృత్యం

మరోవైపు అసోంలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారానికి ప్రియాంకగాంధీ వాద్రా శంఖారావం పూరించారు. సోమవారం ఆ రాష్ట్రంలో పర్యటించిన ఆమె పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. లఖింపూర్‌లో తేయాకు తోటల్లో పనిచేసే ఆదివాసీ మహిళలతో కలిసి వారి సంప్రదాయ ‘ఝుమర్‌’ నృత్యం చేశారు. ఈ వీడియోను కాంగ్రెస్‌ తమ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. 
 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని