Delhi Liquor Case: కీలక పరిణామం.. వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్న రామచంద్రపిళ్లై

దిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరుణ్‌ రామచంద్ర పిళ్లై తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు.

Updated : 10 Mar 2023 13:54 IST

దిల్లీ: దిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరుణ్‌ రామచంద్ర పిళ్లై తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు దిల్లీలోని రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. 

భారాస ఎమ్మెల్సీ కవితకు తాను బినామీనంటూ ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి ఇచ్చిన వాంగ్మూలంలో రామచంద్ర పిళ్లై పేర్కొన్నారు. తాజాగా ఆ వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానని.. దీనికి అనుమతించాలని ఆయన కోరారు. మిగతా విచారణకు సహకరిస్తానని తెలిపారు. రామచంద్ర పిళ్లై పిటిషన్‌ నేపథ్యంలో ఈడీకి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈనెల 13 వరకు ఈడీ కస్టడీలో పిళ్లై ఉండనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని