కొత్త కేసులు 97,570.. రికవరీలు 81,533

దేశంలో రోజురోజుకీ కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా ఉంటోంది. శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 81,533 మంది కోలుకొని ఇళ్లకు చేరారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 36,24,196కు పెరిగింది.........

Published : 12 Sep 2020 15:19 IST

అత్యధిక కేసులున్న రాష్ట్రాల్లోనే రికవరీలూ ఎక్కువ

దిల్లీ: దేశంలో రోజురోజుకీ కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. కోలుకుంటున్న వారి సంఖ్యా గణనీయంగా ఉంటోంది. శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 81,533 మంది కోలుకొని ఇళ్లకు చేరారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 36,24,196కు పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు 77.77 శాతంగా ఉంది. అంటే ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారిలో మూడో వంతు మంది కోలుకున్నారు. వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతి ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌లోనే 60 శాతం మంది కోలుకున్నారు. శుక్రవారం ఒక్కరోజు మహారాష్ట్రలో 14,000, కర్ణాటకలో 12,000 మంది కోలుకొని ఇళ్లకు చేరారు. కొవిడ్‌ కట్టడికి భారత్‌లో తీసుకుంటున్న పటిష్ఠ చర్యల వల్లే రికవరీలు గణనీయంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 

ఇక శనివారం ఉదయం 8గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 97,570 కేసులు నమోదయ్యాయి. వీటిలో 60 శాతం కేసులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌లోనే వెలుగు చూశాయి. ఒక్క మహారాష్ట్రలోనే 24వేల కేసులు రాగా.. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక ఒక్కో రాష్ట్రంలో 9వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేసులు ఎక్కువగా వస్తున్న రాష్ట్రాల్లోనే రికవరీలూ ఎక్కువగా ఉంటున్నాయి. 

ఇక శుక్రవారం కొత్తగా 1,201 మంది కొవిడ్‌తో పోరాడుతూ మృతిచెందారు. ఒక్క మహారాష్ట్రలోనే 36 శాతం అంటే 442 మంది మరణించారు. తర్వాత కర్ణాటకలో 130 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో 69 శాతం మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, దిల్లీలోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 5.51 కోట్ల నమూనాలకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వీటిలో ఒక్క శుక్రవారం రోజే 10,91,251 పరీక్షలు జరిపారు.

ఇవీ చదవండి..
24 గంటల్లో 97,570 కేసులు.. 1,201 మరణాలు

రేసులోకి మరో వ్యాక్సిన్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు