14 రాష్ట్రాలకు రూ.6వేలకోట్లు..!

కేంద్ర ప్రభుత్వం బుధవారం 14 రాష్ట్రాలకు రూ.6,194 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రాల ఆదాయాల లోటును తీర్చేందుకు 12వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను చెల్లించింది. ఈ చివరి విడత మొత్తంతో కలిపి ఇప్పటి వరకు రూ.74,340 కోట్లను రాష్ట్రాలకు విడుదల చేసినట్లైంది.

Published : 10 Mar 2021 16:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కేంద్ర ప్రభుత్వం బుధవారం 14 రాష్ట్రాలకు రూ.6,194 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రాల ఆదాయాల లోటును తీర్చేందుకు 12వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను చెల్లించింది. ఈ చివరి విడత మొత్తంతో కలిపి ఇప్పటి వరకు రూ.74,340 కోట్లను రాష్ట్రాలకు విడుదల చేసినట్లైంది. పీడీఆర్‌డీ కింద వీటిని ప్రభుత్వం కేటాయించింది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.  ఈ ఆర్థిక సంవత్సరానికి పీడీఆర్‌డీ కింద 14 రాష్ట్రాలకు రూ.74,340 కోట్లు విడుదల చేయాలని 15వ ఆర్థిక సంఘం సూచించింది. 

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 275 ప్రకారం ఈ నిధులను కేటాయిస్తున్నారు. అధికారాలు బదలాయించిన రాష్ట్రాలకు ఈ క్రమంలో 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆదాయలోటును తగ్గించేలా ఈ సొమ్ము అందుతోంది. అర్హులైన రాష్ట్రాలను ఆర్థికసంఘమే ఎంపిక చేస్తుంది. ఈ సారి ఆదాయలోటు ఉన్న రాష్ట్రాలుగా ఎంపికైన వాటిలో ఆంధ్రప్రదేశ్‌, అసోమ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ ,మణిపూర్‌, మేఘాలయా, మిజోరాం, నాగాల్యాండ్‌, పంజాబ్‌, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్‌, వెస్ట్‌బెంగాల్‌లు ఉన్నాయి. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని