Robert Vadra: మంత్రిగారూ.. నా గురించి కాదు మణిపుర్ గురించి ఆలోచించండి..!

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్‌లో చూపించిన ఫొటోపై వ్యాపారవేత్త రాబర్ట్‌ వాద్రా(Robert Vadra) విమర్శలు గుప్పించారు. మణిపుర్ గురించి ఆలోచించండని సూచించారు. 

Published : 12 Aug 2023 18:43 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్‌ వాద్రా(Robert Vadra).. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani)పై మండిపడ్డారు.

‘మణిపుర్ మండిపోతోంది. కానీ ఈ మంత్రి(స్మృతి ఇరానీ) అనవసరంగా నా ప్రస్తావన తీసుకువస్తున్నారు’ అని విమర్శించారు. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీతో రాబర్ట్ వాద్రా కలిసి ఉన్న చిత్రాన్ని ఇరానీ పార్లమెంట్‌లో చూపించారు. దీనిపై వాద్రా ఈ విధంగా స్పందించారు. గతంలో కూడా ఆమె అదానీ-రాబర్ట్ వాద్రా చిత్రాన్ని చూపించి కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీపై విమర్శలు గుప్పించారు.  ‘రాహుల్ గాంధీకి అదానీ విషయంలో  ఇబ్బంది ఉంటే.. మరి ఆయనతో రాబర్ట్ వాద్రా ఎందుకు ఉన్నారు..? ’అని అప్పట్లో ప్రశ్నించారు. 

ఎటు చూసినా కాలిన శవాలే.. బూడిదైన హవాయి స్వర్గధామం

 ‘ఇరానీజీ నా గురించి ఆలోచించడం తగ్గించండి. పార్లమెంట్ వేదికగా నా పేరును దుర్వినియోగం చేయడం మానుకోండి. నాపై విమర్శలు చేసి మీ అసమర్థతను కప్పిపుచ్చుకోలేరు. మీరు నా వైపు ఒక వేలు చూపిస్తే.. మిగతా వేళ్లు మీ వైపే ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. మీ గోవా రెస్టారెంట్, మీ డిగ్రీల గురించి దేశ ప్రజలకు సమాధానం ఇవ్వండి. సమాధానం ఇవ్వలేదంటే.. మీరు వాస్తవాలు దాస్తున్నట్లు అర్థం’ అని ఫేస్‌బుక్‌ పోస్టులో వాద్రా విమర్శలు గుప్పించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని