
అయోధ్య గుడికి రూ.1,511 కోట్ల విరాళాలు
అయోధ్య రామమందిర నిర్మాణానికి రూ.1,511కోట్ల విరాళాలు వచ్చినట్లు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి మహరాజ్ తెలిపారు. ఈ మొత్తం ఫిబ్రవరి 11 సాయంత్రం నాటికి అందినట్లు ఆయన వెల్లడించారు. మొదట ఈ ఆలయ నిర్మాణానికి రూ.1,100కోట్లకు పైగా ఖర్చవుతుందని ట్రస్ట్ అంచనా వేసింది. ఆలయ నిర్మాణం కోసం చుట్టుపక్కల ఉన్న భూమిని కూడా కొనడానికి ట్రస్ట్ ప్రయత్నిస్తోందని, అందుకే ఖర్చు ముందుగా అంచనా వేసిన దానికంటే ఎక్కువే కావచ్చన్నారు.
రామకథలతో విరాళాల సేకరణ
రామమందిర నిర్మాణం కోసం సూరత్‌కి చెందిన ఓ బాలిక రామకథలు పారాయణం చేస్తూ రూ.50లక్షలు సేకరించి ఔరా అనిపించింది. 6వ తరగతి చదువుతున్న భవిక రాజేశ్ మహేశ్వరి లాక్‌డౌన్ సమయంలో తన చదువుతో పాటు భగవద్గీతను అధ్యయనం చేసింది. రామాయణ పఠనంతో రాముడి గొప్పతనం గురించి తెలుసుకున్నానని.. ఆలయ నిర్మాణానికి తనవంతుగా ‘రామకథలు’ పారాయణం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. వేదికపై కూర్చుని భవిక చెప్పే రామకథలను వింటుంటే భక్తిపారవశ్యంలో మునిగిపోతామని భక్తులు చెబుతున్నారు.
ఇవీ చదవండి..
పారిశ్రామికోత్పత్తి కళకళ