Hemant Soren: రాష్ట్రపతి విందుకు సోరెన్‌..ఈడీ విచారణకు డుమ్మా..!

G20 Summit: భారత్ అధ్యక్షతన దిల్లీలో జీ20 సదస్సు జరుగుతోంది. ఈ క్రమంలో ఇచ్చే విందుకు ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం అందింది. 

Published : 09 Sep 2023 12:39 IST

దిల్లీ: భారత్‌ నిర్వహిస్తోన్న జీ20 సదస్సు(G20 Summit) వేళ.. శనివారం రాత్రి అతిథులకు రాష్ట్రపతి విందు(G20 dinner) ఇస్తున్నారు. దీనికి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం అందింది. వారిలో పలువురు సీఎంలు ఇప్పటికే దిల్లీ బయలుదేరారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌(Hemant Soren) కూడా విందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. దాంతో ఆయన ఈ రోజు హాజరుకావాల్సిన ఈడీ విచారణకు డుమ్మా కొట్టనున్నట్లు కనిపిస్తోంది.

మనీలాండరింగ్ కేసులో సోరెన్‌ ఈడీ(ED) ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆగస్టు 14, ఆగస్టు 24 తేదీల్లో ఆయను గైర్హాజరయ్యారు. దాంతో సెప్టెంబర్ 9న రాంచిలోని తమ ప్రాంతీయ కార్యాలయంలో హాజరుకావాలని ఈడీ నోటీసు(ED summons)ల్లో పేర్కొంది. అయితే జీ20 సదస్సు నేపథ్యంలో ఈ రోజు రాత్రి రాష్ట్రపతి విందు ఇస్తున్నారు. ఆ నిమిత్తం సోరెన్ దిల్లీ వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. దాంతో ఇప్పుడు ఆయన ఈ విచారణకు హాజరుకావడం తెలుస్తోంది. ఇదివరకు అక్రమ మైనింగ్‌ వ్యవహారంతో సంబంధం ఉందన్న ఆరోపణలపై సోరెన్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని