Mumbai: వైద్య కళాశాలలో 30 మంది విద్యార్థులకు కరోనా..!

మహారాష్ట్రలోని ఓ వైద్య కళాశాలలో విద్యార్థులకు మూకుమ్మడిగా కరోనా సోకడం కలకలం సృష్టిస్తోంది. ముంబయిలోని ప్రభుత్వ రంగ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రి కింగ్‌ ఎడ్వర్డ్‌ మెమోరియల్‌

Published : 30 Sep 2021 17:11 IST

ముంబయి: మహారాష్ట్రలోని ఓ వైద్య కళాశాలలో విద్యార్థులకు మూకుమ్మడిగా కరోనా సోకడం కలకలం సృష్టిస్తోంది. ముంబయిలోని ప్రభుత్వ రంగ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రి కింగ్‌ ఎడ్వర్డ్‌ మెమోరియల్‌(కేఈఎం) హాస్పిటల్‌లో 30 మంది వైద్య విద్యార్థులు కొవిడ్‌ బారినపడ్డారు. వీరిలో 23 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కాగా.. ఏడుగురు ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులు. వైరస్‌ సోకిన వారిలో ఇద్దరికి లక్షణాలు తీవ్రంగా ఉండటంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. మిగతా వారిని స్వీయనిర్బంధంలో ఉంచారు.

మరోవైపు కాలేజీలోని ఇతర విద్యార్థులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా.. కరోనా బారిన పడిన 30 మందిలో 28 మంది విద్యార్థులు రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు తెలిసింది. కాలేజీలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమం కారణంగా వీరందరికీ కరోనా వ్యాప్తి చెంది ఉండొచ్చని ముంబయి మేయర్‌ కిశోరీ పడ్నేకర్‌ అభిప్రాయపడ్డారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు.

కరోనా రెండో దశ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో స్కూళ్లు, కళాశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే ఇటీవల కొన్ని స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులు ఒకేసారి కరోనా బారిన పడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల బెంగళూరులోని ఓ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో 54 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని