West Bengal: సువేందు అధికారిపై ఎఫ్‌ఐఆర్‌!

భాజపా నాయకుడు, పశ్చిమ బెంగాల్‌ ప్రతిపక్ష నేత సువేందు అధికారి, ఆయన సోదరుడు సౌమేందు అధికారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. రూ.లక్షల విలువ చేసే వస్తువులు చోరీ కేసులో వారిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు......

Published : 06 Jun 2021 12:19 IST

కోల్‌కతా: భాజపా నాయకుడు, పశ్చిమ బెంగాల్‌ ప్రతిపక్ష నేత సువేందు అధికారి, ఆయన సోదరుడు సౌమేందు అధికారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. రూ.లక్షల విలువ చేసే వస్తువుల చోరీ కేసులో వారిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంతి మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ బోర్డులో సభ్యుడైన రత్నదీప్‌ మన్నా చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 

మే 29, 2021 మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో సువేందు అధికారి, కంతి మున్సిపాలిటీ మాజీ చీఫ్‌ అయిన ఆయన సోదరుడు సౌమేందు ఆదేశాల మేరకు కొంత మంది కంతి మున్సిపల్‌ కార్యాలయం నుంచి లక్షల విలువ చేసే పునరావాస వస్తువులు బలవంతంగా తీసుకెళ్లారని మన్నా ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా గోడౌన్‌ తాళాలను పగలగొట్టారని తెలిపారు. వారి భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన బలగాలను సైతం ఈ పనికి వాడుకున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని