యూట్యూబ్‌ చూస్తూ గర్భస్రావానికి యత్నం.. ఆసుపత్రిపాలైన అత్యాచార బాధితురాలు

అత్యాచార ఫలితంగా గర్భం దాల్చిన ఒక మహిళ (25).. యూట్యూబ్‌ వీడియోలు చూస్తూ సొంతంగా గర్భస్రావానికి ప్రయత్నించి, ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చారు. మహారాష్ట్రలోని

Updated : 28 Sep 2021 07:09 IST

 

నాగ్‌పుర్‌: అత్యాచార ఫలితంగా గర్భం దాల్చిన ఒక మహిళ (25).. యూట్యూబ్‌ వీడియోలు చూస్తూ సొంతంగా గర్భస్రావానికి ప్రయత్నించి, ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రిలో చేర్చారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డ షోయబ్‌ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై రేప్‌ సహా పలు అభియోగాల కింద కేసు నమోదు చేశారు. ‘‘పెళ్లి చేసుకుంటానని నమ్మించి, 2016 నుంచి షోయబ్‌ తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాధితురాలు చెప్పింది. ఆమె గర్భం దాల్చడంతో.. యూట్యూబ్‌ వీడియోలు చూసి, అబార్షన్‌కు ప్రయత్నించాలని, వాటిలో సూచించిన మందులను వాడాలని అతడు సలహా ఇచ్చాడు’’ అని పోలీసు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని