Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 08 May 2024 17:00 IST

1. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను కొట్టేసిన క్యాట్‌

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) కొట్టి వేసింది. రెండోసారి ఆయన సస్పెన్షన్‌ చట్టవిరుద్ధమని పేర్కొంది. ఒకే కారణంతో ప్రభుత్వం తనను రెండుసార్లు సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ జరిపిన క్యాట్‌.. ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. పెనమలూరులో వైకాపా ప్రలోభాలు.. పంపిణీకి సిద్ధంగా ఉంచిన వస్తువులు స్వాధీనం

 కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్ల ప్రలోభాల కోసం ఉంచిన వివిధ రకాల వస్తువుల్ని పోలీసులు పట్టుకున్నారు. గంగూరు ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పెనమలూరు వైకాపా అభ్యర్థి జోగి రమేశ్‌ అద్దెకు తీసుకున్నారు. అందులో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు గృహోపకరణ వస్తువులతో పాటు నగదు దాచి ఉంచారని సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు అందడంతో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అక్కడికి వెళ్లింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ‘ట్రంప్‌తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌(Donald Trump)తో ‘ఏకాంతంగా’ గడిపానని శృంగార తార స్టార్మీ డేనియల్‌ పేర్కొన్నారు. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బులు కూడా ముట్టజెప్పారన్నారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో తనపై వ్యతిరేకంగా మాట్లాడకుండా అడ్డుకోవడానికి ట్రంప్‌ అడ్డదారులు తొక్కారనే (Hush money) ఆరోపణలపై విచారణ జరుగుతోన్న క్రమంలో న్యూయార్క్‌ కోర్టులో ఆమె  వాంగ్మూలం ఇచ్చారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. రాహుల్‌.. వారి గురించి ఇప్పుడు మాట్లాడవే: ప్రధాని మోదీ

 హఠాత్తుగా రాహుల్‌ గాంధీ ఈ ఎన్నికల్లో అంబానీ - అదానీల గురించి మాట్లాడడం మానేశారెందుకని ప్రధాని మోదీ ప్రశ్నించారు. వారితో ఏమైనా రహస్య ఒప్పందం కుదిరి ఉంటుందేమోనని ఎద్దేవా చేశారు. తెలంగాణలోని వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యానించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. కంచుకోటలను కాపాడుకుంటారా.. అమేఠీ, రాయ్‌బరేలీలో ప్రచారాన్ని భుజానకెత్తుకున్న ప్రియాంక

యూపీలో అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాలు కాంగ్రెస్‌కు ఎంతో కీలకం. గాంధీ కుటుంబానికి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ స్థానాల్లో గెలుపు ప్రస్తుతం ఆ పార్టీకి అత్యంత అవసరం. దీంతో అగ్రనేత ప్రియాంక గాంధీ ఈ నియోజకవర్గాల్లో రంగంలోకి దిగారు. పార్టీ ప్రచార బాధ్యతలను భుజానకెత్తుకున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. జూన్‌ 5న కాంగ్రెస్‌లోకి 25 మంది భారాస ఎమ్మెల్యేలు: మంత్రి కోమటిరెడ్డి

తనకు పదవులపై ఆశలేదని.. రానున్న పదేళ్లూ రేవంత్‌రెడ్డే సీఎం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దిల్లీ మద్యం కేసులో అరెస్టయి జైలులో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత తెలంగాణ పరువు తీస్తున్నారని విమర్శించారు. త్వరలోనే భారాస దుకాణం ఖాళీ అవుతుందన్నారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్‌గా

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) మరోసారి ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. లోక్‌సభ ఎన్నికల వేళ మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడమే ఇందుక్కారణం. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలపై ప్రభావం చూపాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో దాదాపు 600 పాయింట్ల మేర లాభనష్టాల మధ్య చలించి చివరికి ఫ్లాట్‌గా ముగిసింది. నిఫ్టీ 22,300 స్థాయిని నిలబెట్టుకుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. భారత్‌లోకి గూగుల్‌ వ్యాలెట్‌ వచ్చేసింది.. ఏమేం యాడ్‌ చేయొచ్చు?

భారత్‌లో ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం గూగుల్‌ ప్రైవేట్‌ డిజిటల్‌ వ్యాలెట్‌ను (Google Wallet) విడుదల చేసింది. దీంట్లో బ్యాంకు కార్డులు, టికెట్లు, పాసులు, ఐడీలను భద్రంగా స్టోర్‌ చేసుకోవచ్చు. ఇది గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి

జమ్మూ-కశ్మీర్‌ (Jammu and Kashmir)లో పూంఛ్‌ జిల్లాలో భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన వాహన శ్రేణిపై ఉగ్రవాదులు గత శనివారం ఒక్కసారిగా కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అయిదుగురు సైనికులు గాయపడినట్లు గాయపడగా.. అందులో ఒకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. శరీర రంగుతో అవమానిస్తే సహించేది లేదు: శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ మండిపాటు

మూడో విడత సార్వత్రిక ఎన్నికలతోనే ఎన్డీయే విజయం ఖాయమైందని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. వరంగల్‌ పరిధిలోని మామునూరులో నిర్వహించిన భాజపా ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత శామ్‌ పిట్రోడా చేసిన ‘జాతి వివక్ష’ వ్యాఖ్యలను ప్రధాని తీవ్రంగా ఖండించారు. శరీర రంగు చూపి ప్రజలను అవమానిస్తారా? అని మండిపడ్డారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని