Telangana news: రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు

రెండ్రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Published : 08 May 2024 18:20 IST

హైదరాబాద్: రెండు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గురువారం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మే 12న రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. మే 15 వరకు వాతావరణం కాస్త చల్లగానే ఉంటుందని, మే 20 తర్వాత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని