Covaxin: కొవాగ్జిన్‌ను గుర్తించిన ఆస్ట్రేలియా

భారత్‌లో దేశీయంగా తయారైన కరోనా టీకా కొవాగ్జిన్‌ను ఆస్ట్రేలియా సోమవారం అధికారికంగా గుర్తించింది. మహమ్మారి నేపథ్యంలో సుమారు 20 నెలల పాటు మూసివేసిన సరిహద్దులను తిరిగి తెరిచిన తరుణంలో ఈ నిర్ణయం

Updated : 02 Nov 2021 11:04 IST

మెల్‌బోర్న్‌: భారత్‌లో దేశీయంగా తయారైన కరోనా టీకా కొవాగ్జిన్‌ను ఆస్ట్రేలియా సోమవారం అధికారికంగా గుర్తించింది. మహమ్మారి నేపథ్యంలో సుమారు 20 నెలల పాటు మూసివేసిన సరిహద్దులను తిరిగి తెరిచిన తరుణంలో ఈ నిర్ణయం వెలువడింది. ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం సంయుక్తంగా రూపొందించిన కొవిషీల్డ్‌ను ఇప్పటికే ఆ దేశం అధికారికంగా గుర్తించింది. ‘‘భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కొవాగ్జిన్‌, చైనాలోని సినోఫామ్‌ తయారుచేసిన బీబీఐబీపీ-కోర్‌వి టీకాలను పర్యాటకుల రాకపోకలకు సంబంధించి అధికారికంగా గుర్తించాలని థెరాప్టిక్‌ గూడ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ నిర్ణయించింది’’ అని సోమవారం ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. 12 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసున్న వారు కొవాగ్జిన్‌ టీకా పూర్తిస్థాయిలో తీసుకుంటే ఇకపై ఆస్ట్రేలియా వెళ్లవచ్చు.  

ప్రధాని మోదీ ధన్యవాదాలు

కొవాగ్జిన్‌ను ఆస్ట్రేలియా గుర్తించడం పట్ల భారత ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌కు ట్విటర్‌ వేదికగా సోమవారం ధన్యవాదాలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని