Mask: ఒమిక్రాన్ వేగంగా ఉంది.. మరి క్లాత్‌మాస్కుల ప్రభావమెంత..?

దాదాపు రెండు సంవత్సరాల క్రితం కరోనా వైరస్ వెలుగుచూడటంతో ప్రపంచవ్యాప్తంగా మాస్కుల వాడకం అత్యవసరంగా మారింది. తర్వాత ఆ మాస్కులు కూడా ఫ్యాషన్‌ను ఒంటబట్టించుకున్నాయి.

Published : 23 Dec 2021 15:19 IST

లండన్: దాదాపు రెండు సంవత్సరాల క్రితం కరోనా వైరస్ వెలుగుచూడటంతో ప్రపంచవ్యాప్తంగా మాస్కుల వాడకం అత్యవసరంగా మారింది. తర్వాత ఆ మాస్కులు కూడా ఫ్యాషన్‌ను ఒంట బట్టించుకున్నాయి. రకరకాల రంగుల్లో, డిజైన్లతో విరివిగా లభిస్తూ.. ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. డెల్టాకంటే వేగంగా వ్యాపించే లక్షణం ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ బయటపడటంతో మాస్కుల వాడకంపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. రంగు రంగుల్లో, తిరిగి వినియోగించే మాస్కుల గురించి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ట్రిష్ గ్రీన్‌హాల్గ్ ఈ మాస్కుల వాడకం గురించి పలు విషయాలు వెల్లడించారు. 

‘ఆ మాస్కులు నిజంగా మంచివి కావొచ్చు లేక భయంకరమైన కావొచ్చు. రెండు మూడు పొరలతో ఉండే క్లాత్ మాస్కులు ప్రభావంతంగా పనిచేస్తాయి. కానీ, వాటి తయారీలో ఫ్యాషన్కే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. వాటిని అలంకరణ వస్తువుగా చూస్తున్నారు. క్లాత్ మాస్కులతో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే.. వాడే క్లాత్ విషయంలో ఎలాంటి వైద్య ప్రమాణాలు పాటించాల్సిన అవసరం లేదు. అదే ఎన్‌95 మాస్కుల తయారీదారులు మాత్రం .. తమ మాస్కులు 95 శాతం కణాలను వడపోస్తాయని నిర్ధారించుకోవాల్సి ఉంది. మాస్కులు పనితీరు ఎంత గొప్పగా ఉన్నా.. ముక్కు, నోటిని వాటితో సరిగా మూయకపోతే అంతా నిష్ర్పయోజనమే. అదే సమయంలో సరిగా శ్వాసతీసుకోవాల్సిన అవసరమూ ఉంది’ అని ట్రిష్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఒమిక్రాన్ వెలుగుచూడటంతో పలు దేశాలు, ప్రభుత్వాలు మాస్క్‌ వాడకాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ  చేస్తున్నాయి.  మాస్క్‌ లేకుండా పట్టుబడిన వారికి జరిమానాలు విధిస్తున్నాయి. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని