IN PICS:చెన్నైలో భారీ వర్షం.. వీధులన్నీ జలమయం!

చెన్నై వాసులను మరోసారి వరుణుడు వణికించాడు. గరువారం మధ్యాహ్నం నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

Updated : 30 Dec 2021 20:02 IST

చెన్నై: చెన్నై వాసులను మరోసారి వరుణుడు వణికించాడు. గురువారం మధ్యాహ్నం నుంచి నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేయగా.. మళ్లీ వర్షం నీటితో నిండాయి. మెట్రో పనులు జరుగుతుండటంతో వడపళనిలో భారీగా వరదనీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎగ్మూర్‌, గిండి, సెంట్రల్‌, పురసైవాక్కం ప్రాంతాల్లో వీధులు కాలువలను తలపించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని