Space tour: అంతరిక్షానికి జపాన్​ కుబేరుల విహార యాత్ర

అంతరిక్ష పర్యాటకంలో మరో ముందడుగు పడింది. జపాన్​కు చెందిన కుబేరులు యుసాకు మిజావా, నిర్మాత యోజో హిరానో అంతరిక్ష యాత్ర చేపట్టారు......

Published : 09 Dec 2021 01:46 IST

బైకనూర్‌: అంతరిక్ష పర్యాటకంలో మరో ముందడుగు పడింది. జపాన్​కు చెందిన కుబేరులు యుసాకు మిజావా, యోజో హిరానో అంతరిక్ష యాత్ర చేపట్టారు. 2009 తర్వాత సొంత ఖర్చులతో అంతరిక్షానికి బయల్దేరిన పర్యాటకులు వీరే కావడం గమనార్హం. రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ మిసుర్కిన్​తో కలిసి యుసాకు, యోజో హిరానో.. సోయూజ్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:38 గంటలకు ఈ ముగ్గురూ.. కజకి​స్థాన్‌లోని బైకనూర్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి వ్యోమనౌకలో బయల్దేరారు. ఈ యాత్రలో భాగంగా.. మిజావా, హిరానో 12 రోజులపాటు అంతరిక్షంలో గడపనున్నారు. అయితే.. ఈ ప్రయాణానికి అయిన ఖర్చులను వారు వెల్లడించలేదు.

ఈ ప్రయాణం సందర్భంగా బిలియనీర్​ మిజావా ఆనందం వ్యక్తం చేశారు. ‘అంతరిక్షం నుంచి నేను భూమిని చూడాలనుకుంటున్నాను. బరువు లేకపోవడం వల్ల కలిగే అనుభూతిని పొందాలనుకుంటున్నాను. నన్ను అంతరిక్షం ఎలా మారుస్తుందో.. ఈ పర్యటన తర్వాత నేను ఎలా మారుతానో చూడాలని నాకు ఆత్రుతగా ఉంది’ అని అంతరిక్ష ప్రయాణానికి ముందు మిజావా హర్షం వ్యక్తం చేశారు.

 

Read latest National - International News and Telugu News

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని