monkeys: కోతులు పగతీర్చుకుంటున్నాయా..? 80 కుక్కపిల్లల్ని చంపేసిన వైనం

కుక్కలపై కోతులు పగ తీర్చుకుంటున్నాయా? అంటే ఔననే అంటున్నారు మహారాష్ట్ర బీడ్‌ జిల్లాలోని ఓ గ్రామ ప్రజలు.......

Updated : 19 Dec 2021 10:46 IST

ముంబయి: కుక్కలపై కోతులు పగ తీర్చుకుంటున్నాయా? అంటే ఔననే అంటున్నారు మహారాష్ట్ర బీడ్‌ జిల్లాలోని ఓ గ్రామ ప్రజలు. ఆ గ్రామంలో కుక్కపిల్లలు కనుమరుగైపోయాయట. ఇందుకు కారణం కోతులు వాటిని చంపేయడమే. చెట్లపైకి, ఎత్తయిన భవనాలపైకి తీసుకెళ్లి అక్కడి నుంచి కిందపడేసి చంపేస్తున్నాయని బీడ్‌ జిల్లా ప్రజలు పేర్కొంటున్నారు. ఒకవేళ అప్పటికీ చనిపోకపోతే.. మళ్లీ పైకి తీసుకెళ్లి కిందపడేస్తున్నాయట. గత నెల రోజుల నుంచి ఇప్పటివరకు మొత్తం దాదాపు 80 కుక్కపిల్లల్ని హత్యచేసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

ఓ కోతి పిల్లని వీధి శునకాలు వెంబడించి హతమార్చిన నేపథ్యంలో.. వాటిపై పగ పెంచుకొన్న వానరాలు ఇలా చేస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. 5000 మంది ఉండే లవూల్‌ అనే గ్రామంలో ప్రస్తుతం ఒక్క కుక్కపిల్ల కూడా బతికి లేదని ఆ గ్రామస్థులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బారి నుంచి కుక్కపిల్లల్ని బతికించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. అవి వాటిని ఎత్తుకుపోతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. ప్రస్తుతం పాఠశాలలకు వెళ్లే చిన్నారులపైనా కోతులు దాడులకు పాల్పడుతున్నాయని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వానరాల బెడద తగ్గించాలని వారు అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని