
Terror Attack: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు
శ్రీనగర్: జమ్మూ- కశ్మీర్‌లో ఉగ్రవాదులు చెలరేగుతున్నారు. తాజాగా గురువారం కుల్గాం జిల్లాలో సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) కాన్వాయ్‌పై కాల్పులకు తెగబడ్డారు. సదరు కాన్వాయ్ జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా.. కుల్గాం జిల్లాలోని మల్‌పోర వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా సిబ్బందిలో ఎవరికి ఏం కాలేదని కశ్మీర్ ఐజీపీ విజయ్‌కుమార్ ట్విటర్ వేదికగా తెలిపారు. దాడికి పాల్పడినవారు అక్కడే దాక్కుని ఉన్నారని చెప్పారు. మరోవైపు అధికార బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని, సీనియర్ అధికారులు కూడా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న వేళ స్థానికంగా ఉగ్రవాదుల వరుస దాడులు పెరిగిపోవడం ఆందోళనకరంగా మారింది. సోమవారం అనంతనాగ్ జిల్లాలో భాజపా నేత, ఆయన భార్యను కాల్చి చంపిన ముష్కరులు.. మంగళవారం భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని గ్రెనేడ్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.