Crime news: పౌష్టికాహారం డబ్బాలో మరో ప్యాకెట్‌.. అదేంటో తెలుసుకుని మహిళ షాక్‌!

ఓ మహిళ.. తన పిల్లల కోసం పౌష్టికాహారం(సిరియల్‌) డబ్బా విప్పి, ఓ గిన్నెలో పోస్తున్నారు. ఇంతలో.. డబ్బాలో ఏదో అడ్డుపడుతున్నట్లు గుర్తించారు. తీరా ఓ కవర్‌ బయటపడగా.. అందులో తెల్లరంగు క్రిస్టల్స్‌ కనిపించాయి. అసలేం పదార్థమో తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌లో..

Published : 01 Jan 2022 19:34 IST

లండన్‌: ఓ మహిళ.. తన పిల్లల కోసం తెచ్చిన పౌష్టికాహారం (సిరియల్‌) డబ్బాను తెరిచి ఓ గిన్నెలో పోస్తున్నారు. ఇంతలో డబ్బాలో ఏదో అడ్డుపడుతున్నట్లు గుర్తించారు. తీరా ఓ కవర్‌ బయటపడగా అందులో తెల్లరంగు క్రిస్టల్స్‌ కనిపించాయి. అవేంటో తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌లో వెతికిన ఆమెకు.. ఒక్కసారిగా షాక్‌ తగిలింది! కారణం.. అది మెథాంఫేటమిన్ (క్రిస్టల్ మెథ్‌) మాదకద్రవ్యంగా తేలడమే. ఈ వ్యవహారం బ్రిటన్‌లో తాజాగా వెలుగుచూసింది. దీంతో ఆందోళనకు గురైన ఆ మహిళ.. వెంటనే ఆ కవర్‌ను పోలీసులకు అప్పగించినట్లు స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి. మరోవైపు పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లి, పరీక్షలు చేయించగా.. అదృష్టవశాత్తు వారిలో డ్రగ్‌ ఆనవాళ్లు దొరకలేదని ఆమె చెప్పారు.

‘ఈ ఘటనతో నిజంగా షాక్‌కు గురయ్యా. సిరియల్‌ డబ్బాలో ఈ డ్రగ్స్‌ ప్యాకెట్‌ సగం వరకు ఉంది. దాదాపు 450 గ్రాముల క్రిస్టల్‌ మెథ్‌ బయటపడింది. ఆ కవర్‌ కూడా పలుచగా ఉండటంతో.. ఆ డ్రగ్స్‌ సిరియల్‌లో కలిసిపోయిందనుకున్నా. కానీ, పిల్లలకు ఏం కాకపోవడం అదృష్టం’ అని ఆ మహిళ చెప్పుకొచ్చారు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ డ్రగ్స్‌ ప్యాకెట్‌ను అందులో ఎవరు పెట్టారో గుర్తించేందుకు యత్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు