china: చైనా కవ్వింపు చర్యలపై అమెరికా ఆందోళన..!

చైనా తరచూ పొరుగు దేశాలను కవ్వించేలా ప్రవర్తించడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. బీజింగ్‌ ప్రవర్తన ప్రపంచ శాంతికి విఘాతంగా మారే ప్రమాదం

Published : 11 Jan 2022 17:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా తరచూ పొరుగు దేశాలను కవ్వించేలా ప్రవర్తించడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. బీజింగ్‌ ప్రవర్తన ప్రపంచ శాంతికి విఘాతంగా మారే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ మేరకు శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ జెన్‌సాకీ ఓ ప్రశ్నకు సమాధానంగా స్పందించారు. భారత్‌-చైనా మధ్య 14వ విడత సైనిక చర్చలు ప్రారంభానికి ఒక రోజు ముందు ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. 

శ్వేతసౌధంలో రోజువారీ ప్రెస్‌ బ్రీఫింగ్‌ సమయంలో అమెరికాతో చైనా చర్చల విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ సమయంలో భారత్‌-చైనా వివాదంపై స్పందించాలని కొందరు కోరారు. దీనికి స్పందించిన సాకీ.. ‘‘భారత్‌-చైనా సరిహద్దుల వద్ద పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఈ సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి మేము పూర్తి మద్దతు ఇస్తాము. ఆ ప్రాంతంలో, ప్రపంచంలో మిగిలిన చోట్ల బీజింగ్‌ ప్రవర్తనను ఏ కోణంలో చూడాలో మాకు స్పష్టంగా తెలుసు. చైనా పొరుగు దేశాలను కవ్వించడంపై ఆందోళన చెందుతున్నాం. ఆ విషయంలో మేము మా భాగస్వాములతో కలసి పనిచేస్తాము’’ అని జెన్‌సాకీ పేర్కొన్నారు.

ఈ నెల 12వ తేదీ నుంచి భారత్‌-చైనా మధ్య సైనికాధికారుల స్థాయిలో 14విడత చర్చలు జరగనున్నాయి. 2020 ఏప్రిల్‌లో వివాదం మొదలైనప్పటి నుంచి పలు విడతలుగా జరిగిన చర్చలు కొంత మేరకు సఫలమై తూర్పు లద్ధాక్‌లోని కీలక ప్రాంతాల్లో దళాల ఉపసంహరణ జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని