Aditya Birla Sun Life: ఐపీఓకు రానున్న ఆదిత్య బిర్లా సన్ లైఫ్

కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా 3,88,80,000 ఈక్విటీ షేర్లను ఆఫర్ చేస్తుంది

Updated : 30 Sep 2021 15:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ సెప్టెంబర్ 29న ఐపీఓకు రానుంది. ఒక్కో ఈక్విటీ షేర్ ఆఫర్ ధరను రూ. 695 నుంచి రూ.712గా సంస్థ నిర్ణయించింది. కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా 3,88,80,000 ఈక్విటీ షేర్లను ఆఫర్ చేయనుంది. ఆదిత్య బిర్లా క్యాపిటల్ 28.5 లక్షలకు పైగా షేర్లను విక్రయించనుండగా, సన్ లైఫ్ (ఇండియా) ఏఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్ 3.6 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనుంది. ఈ ఆఫర్‌లో ఆదిత్య బిర్లా.. క్యాపిటల్, వాటాదారుల కోసం 19.44 లక్షల ఈక్విటీ షేర్లను రిజర్వ్ చేయనుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 1న ముగుస్తుంది. 

ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ రూ.2,768.25 కోట్లను సమీకరించాలని చూస్తోంది. ఇది పూర్తిగా ఓఎఫ్ఎస్ ఇష్యూ అయినందున, ఇష్యూ నుంచి వచ్చిన ఆదాయం వాటాదారులకు వెళ్తుంది. కంపెనీ ఎలాంటి ఆదాయాన్నీ అందుకోదు. పెట్టుబడిదారులు కనీసం 20 ఈక్విటీ షేర్లను, అలాగే 20 షేర్ల గుణిజాలకు బిడ్ చేయొచ్చు. రిటైల్ పెట్టుబడిదారుల కనీస పెట్టుబడి సింగిల్ లాట్ కోసం రూ.14,240గాను, గరిష్ఠంగా 14 లాట్ల కోసం రూ. 1,99,360 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ఆఫర్‌లో సగభాగం అర్హత పొందిన సంస్థాగత కొనుగోలుదారులకు, 35 శాతం రిటైల్ పెట్టుబడిదారులకు, మిగిలిన 15 శాతం సంస్థేతర పెట్టుబడిదారులకు రిజర్వ్  చేశారు. ప్రస్తుతం ఇది పూర్తిగా ఇద్దరు ప్రమోటర్ల అధీనంలో ఉంది. ఆదిత్య బిర్లా క్యాపిటల్ 51 శాతం వాటాను, సన్ లైఫ్ ఏఎంసీ మిగిలిన 49 శాతాన్ని కలిగి ఉంది. జూన్, 2021 నాటికి కంపెనీ తన మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసులు, ఆఫ్‌షోర్, రియల్ ఎస్టేట్ ఆఫరింగ్స్ కింద మొత్తం రూ. 2,93,642 కోట్ల ఏయూఎంను నిర్వహించింది.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని