
Rahul Gandhi: రోహిత్ వేముల నా హీరో: రాహుల్ గాంధీ
దిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నేడు రోహిత్ వేముల ఆరో వర్థంతి. ఈ సందర్భంగా అతడికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా నివాళులర్పించారు. ‘‘రోహిత్ వేముల జాతి వివక్ష.. అవమానాలతో హత్యకు గురయ్యాడు. ఇన్నేళ్లు గడిచినా ప్రతిఘటనకు రోహిత్, నమ్మకానికి ఆయన తల్లి చిహ్నాలుగా నిలుస్తున్నారు. ప్రాణం పోయే వరకు పోరాడిన రోహితే నా హీరో.. నా సోదరుడు’’అని ట్వీట్లో రాహుల్ పేర్కొన్నారు.
2016 జనవరి 17న హెచ్సీయూలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు. యూనివర్సిటీ అధికారులు, ఇతర విద్యార్థి సంఘాల వేధింపుల కారణంగానే రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని దళిత సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమించాయి. విద్యాసంస్థల్లో దళిత విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం రోహిత్ చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.