Mi Smart TV: బడ్జెట్ ధర..ప్రీమియం ఫీచర్లు

షావోమి కంపెనీ గృహోపకరణాల శ్రేణిలో మరో కొత్త ఉత్పత్తిని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4సీ పేరుతో కొత్త టీవీని తీసుకొచ్చింది. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో వినియోగదారులకు అందుబాటు ధరలో ఈ టీవీని తీసుకొచ్చినట్లు షావోమి తెలిపింది. మరి ఇందులోఎలాంటి ఫీచర్లున్నాయి..?ధరెంత..? ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయనేది చూద్దాం... 

Published : 05 Aug 2021 23:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: షావోమి కంపెనీ గృహోపకరణాల శ్రేణిలో మరో కొత్త ఉత్పత్తిని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4సీ పేరుతో కొత్త టీవీని తీసుకొచ్చింది. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో వినియోగదారులకు అందుబాటు ధరలో ఈ టీవీని తీసుకొచ్చినట్లు షావోమి తెలిపింది. మరి ఇందులోఎలాంటి ఫీచర్లున్నాయి..?ధరెంత..? ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయనేది చూద్దాం. 

ఎంఐ కొత్త టీవీలో 178 డిగ్రీల వ్యూ యాంగిల్‌, 60Hz రిఫ్రెష్ రేట్‌తో 32-అంగుళాల హెచ్‌డీ రెడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్‌ ఆధారిత ప్యాచ్‌వాల్ ఇంటర్‌ఫేస్‌తో పనిచేస్తుంది. మెరుగైన వీడియో క్వాలిటీ కోసం షావోమి వివిడ్ పిక్చర్ ఇంజిన్ అమర్చారు. ఎంఐ క్విక్ వేక్ ఫీచర్ సాయంతో కేవలం ఐదు సెకన్ల కంటే తక్కువ వ్యవధిలోనే టీవీ ఆన్ అవుతుంది. గూగుల్ అసిస్టెంట్‌ను సపోర్ట్ చేస్తుంది. 64-బిట్ అమోలాజిక్ కోర్టెక్స్ ఏ53 క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. గ్రాఫిక్స్ కోసం  450 ఎంపీ3 కార్డ్‌ను ఇస్తున్నారు. 

1జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌తో పనిచేస్తుంది. బ్లూటూత్, వైఫైతోపాటు హెచ్‌డీఎంఐ, రెండు యూఎస్‌బీ 2.0, ఏవీ, ఈథర్‌నెట్, ఇయర్‌ఫోన్ అవుట్ పోర్టులు ఉన్నాయి. అద్భుతమైన ఆడియో అనుభూతి కోసం డీటీఎస్‌ హెచ్‌డీ ఆడియో సపోర్ట్‌తో రెండు 10వాట్ స్పీకర్స్‌ ఇస్తున్నారు. రిమోట్‌లో కూడా వాయిస్‌ అసిస్టెంట్ ఫీచర్ ఉంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ ఇన్‌స్టా యాక్సెస్ కీలు ఇస్తున్నారు. అలానే ప్యాచ్‌వాల్ సాయంతో ఓటీటీలలో కంటెంట్ వెతికే సదుపాయం ఉంది. ఎంఐ ఎల్‌ఈడీ టీవీ 4సీ ధర రూ. 15,999గా కంపెనీ నిర్ణయించింది. ఎంఐ వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చెయ్యొచ్చు. 

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts