zareen khan: ఆ కామెంట్లు తట్టుకోలేకపోయా!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘వీర్’తో వెండితెరకు కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు నటి జరీన్‌ఖాన్. మొదటి సినిమాతో పరాజయం...
ఏదీ శాశ్వతం కాదని అర్థమైంది: జరీన్‌ఖాన్
ముంబయి: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘వీర్’తో వెండితెరకు కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు నటి జరీన్‌ఖాన్. మొదటి సినిమాతో పరాజయం చవిచూసిన జరీన్ అనంతరం పలు బాలీవుడ్, దక్షిణాది చిత్రాల్లో నటించినప్పటికీ గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా జరీన్‌ఖాన్.. తన మొదటి సినిమా అనుభవాన్ని గురించి ఇలా చెప్పుకొచ్చారు.
‘నాకు 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. అన్ని విషయాలపై ఇప్పటితరం యువతకు ఉన్న అవగాహన అప్పట్లో నాకు లేదు. దాంతో ఇండస్ట్రీలో ప్రతి విషయం నాకు కొత్తగానే ఉండేది. నిజం చెప్పాలంటే సెట్‌లోకి అడుగుపెట్టిన మొదటిరోజు.. కెమెరా ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియలేదు. సినిమాపై నాకెలాంటి అవగాహన లేదు. కానీ సినీ పరిశ్రమలో ఎంతో అనుభవం కలిగిన వ్యక్తులతో నా మొదటి సినిమా చేశాను. దాంతో సినిమా పరంగా ఎవరు ఏం చెప్పినా వినేదాన్ని. ‘వీర్’ షూట్ సమయంలో కొంతమంది బరువు పెరగమని చెప్పారు. ఆ మాట ప్రకారమే బరువు పెరిగాను. వాళ్లు చెప్పినట్లే కెమెరా ముందు నటించాను. కానీ, సినిమా విడుదలయ్యాక.. చాలామంది నా శరీరాకృతి గురించి విపరీతమైన కామెంట్లు చేశారు. అప్పట్లో నా శరీర బరువు ఓ జాతీయ సమస్యలా మారింది. అందరూ నా బరువు గురించే మాట్లాడుకున్నారు. దాంతో ఎంతో బాధపడ్డాను. కొంతకాలానికి వాటిని పట్టించుకోవడం మానేశాను. ఏదీ శాశ్వతం కాదని ఈ ఇండస్ట్రీ నాకు నేర్పించింది. సినిమా సినిమాకీ అభిప్రాయాల్లో మార్పులు వచ్చేస్తాయి. కాబట్టి ఏదీ హృదయానికి దగ్గరగా తీసుకోకూడదని తెలుసుకున్నాను’ అని జరీన్‌ఖాన్ వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
African:ఆఫ్రికాలో కొత్త వైరస్.. ముక్కు నుంచి రక్తస్రావమైన 24 గంటల్లోనే ముగ్గురి మృతి
-
India News
Rajasthan: ‘గహ్లోత్‌జీ వారి మొర ఆలకించండి’.. ప్రైవేట్ వైద్యులకు సచిన్ పైలట్ మద్దతు!
-
Sports News
IND vs PAK: వన్డే ప్రపంచ కప్ 2023.. భారత్‌లో ఆడేది లేదన్న పాక్.. తటస్థ వేదికల్లోనే నిర్వహించాలట!
-
Crime News
Robbery: సినిమాలో చూసి.. రూ.47 లక్షలు కాజేసి..!
-
Movies News
Rana Naidu: ‘రానా నాయుడు’.. తెలుగు ఆడియో డిలీట్.. కారణమదేనా?
-
Politics News
BJP vs Congress: ‘రాహుల్జీ మీకు ధన్యవాదాలు’.. జర్మనీపై దిగ్విజయ్ ట్వీట్‌కు భాజపా కౌంటర్!