Raviteja: ఉగాదికి ఆరంభం

రవితేజ కథానాయకుడిగా తెరకెక్కనున్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’ ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. ఉగాది రోజున సినిమాకి కొబ్బరికాయ కొట్టనున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్‌

Updated : 23 Mar 2022 13:59 IST

వితేజ కథానాయకుడిగా తెరకెక్కనున్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’ ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. ఉగాది రోజున సినిమాకి కొబ్బరికాయ కొట్టనున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాత. మోస్ట్‌ వాంటెడ్‌ దొంగ జీవిత చరిత్రగా, 1970 నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. రవితేజ ఈ సినిమా కోసం తన శరీరాకృతిని మార్చుకోనున్నారని... ఆయన యాస, హావభావాలు కొత్తగా ఉంటాయని సినీ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని