Vijay Deverakonda: విలన్‌గా విజయ్ దేవరకొండ.. బీటౌన్‌లో భారీ ప్రాజెక్ట్ ఓకే చేశాడా..?
విజయ్ దేవరకొండకు బాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. బీటౌన్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో ఆయన కీలకపాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
ముంబయి: ‘లైగర్’తో బాలీవుడ్‌లోనూ స్టార్‌హీరోగా నిలదొక్కుకోవాలని ఆశపడ్డారు నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). అయితే, ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ బీటౌన్ నుంచి విజయ్‌కు ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏమిటంటే ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra).
బాలీవుడ్ నుంచి విడుదలైన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘బ్రహ్మాస్త్ర’. రణ్‌బీర్ కపూర్, అలియా భట్ నటీనటులు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మొదటి భాగం విడుదలై మంచి టాక్ అందుకుంది. ఈ నేపథ్యంలో ‘బ్రహ్మాస్త్ర - 2’పై చిత్రబృందం దృష్టి పెట్టింది. శివ (రణ్‌బీర్‌కపూర్) గతాన్ని, అతడి తల్లిదండ్రుల గురించి, సినిమాలోని మెయిన్ విలన్ (దేవ్)ని ఇందులో చూపించనున్నట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న నటుడిని దేవ్ పాత్రలో చూపిస్తే బాగుంటుందని చిత్రబృందం భావించిందట. ఈ మేరకు విజయ్ దేవరకొండ అయితే ఈ రోల్‌కు సరైన న్యాయం చేయగలరని, అలాగే, ఆయన్ని తమ టీమ్‌లోకి చేర్చుకుంటే దక్షిణాదిలోనూ తమ సినిమాకి పాపులారిటీ వస్తుందని నిర్మాత కరణ్ జోహార్, చిత్ర దర్శకుడు అయాన్ అనుకున్నారని, దీంతో విజయ్‌ని సంప్రదించారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే కనుక నిజమైతే.. సినిమాలో మెయిన్ విలన్‌గానే కాకుండా రణ్‌బీర్ తండ్రి పాత్రలో దీపికకు జోడీగా విజయ్ దేవరకొండ కనిపించే అవకాశం ఉందని ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: టెస్టుల్లోకి అరంగేట్రం.. ఒకరు నాలుగేళ్లుగా జట్టుతోనే.. మరొకరు టీ20ల్లో నంబర్‌వన్
-
India News
PT Usha: రాజ్యసభ సమావేశాలను నిర్వహించిన పీటీ ఉష
-
Sports News
IND vs AUS: నాగ్‌పుర్ పిచ్ ఏం చెబుతోంది?
-
Politics News
PM Modi: వారి ప్రవర్తన బాధాకరం.. విపక్షాలు విసిరే బురదలోనూ ‘కమలం’ వికసిస్తుంది: మోదీ
-
Movies News
Ott Movies: ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు
-
Sports News
IND vs AUS: రవీంద్రజాలంలో ఆసీస్ విలవిల.. 200లోపే ఆలౌట్