
Allu arjun: అక్కడ థియేటర్స్‌లో విడుదలవుతున్న ‘అల వైకుంఠపురములో’
హైదరాబాద్: ఒక భాషలో విజయవంతమైన చిత్రాలను మరొక భాషలో విడుదల చేయడం కొత్తేమీ కాదు. అయితే, ఒక హీరో నటించిన సినిమా ఇతర భాషల్లో విజయవంతమైతే, అంతకుముందు అతడు నటించిన సినిమాలను కూడా డబ్బింగ్ చేసి, కొన్నిసార్లు విడుదల చేస్తుంటారు. కొత్త సినిమా వల్ల వచ్చిన పాపులారిటీని ఇలా వాడేసుకుంటారు. అలా గతంలో పలువురు తమిళ హీరోల చిత్రాలు తెలుగులో విడుదలై అలరించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ నటించిన సినిమా అదేబాటలో పయనించనుంది.
ఇటీవల బన్ని నటించిన ‘పుష్ప’ హిందీ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. దీంతో ఆయన క్రేజ్ ఉత్తరాదిలోనూ పెరిగింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా డబ్ చేసి థియేటర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా 2020 సంక్రాంతి కానుగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. పూజా హెగ్డే అందాలు, తమన్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడు జనవరి 26న హిందీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. గోల్డ్‌మైన్స్ ఫిల్మ్స్ దీన్ని థియేటర్స్‌లో విడుదల చేయనుంది. మరోవైపు కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా ఇదే సినిమాను రీమేక్ చేస్తుండటం గమనార్హం.
Advertisement