Hari Hara Veera Mallu: పవన్ చిత్రంలో ఆమె కాదు ఈమె?

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’. తొలి కథానాయికగా నిధి అగర్వాల్ ఎంపికవగా మరో కీలక పాత్రలో నర్గిస్‌ ఫక్రి కనిపించనుంది.

Published : 04 May 2022 16:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఇందులో తొలి కథానాయికగా నిధి అగర్వాల్ ఎంపికవగా మరో కీలక పాత్రలో నర్గిస్‌ ఫక్రి కనిపించనుంది. వీరితోపాటు జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఈ సినిమాలో సందడి చేస్తుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆమె స్థానాన్ని నోరా ఫతేహి భర్తీ చేయబోతుందంటూ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అతి త్వరలోనే ఆమె చిత్రీకరణలో పాల్గొనే అవకాశాలున్నాయని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కెనడా అందం నోరా ఫతేహి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ‘టెంపర్‌’లోని ‘ఇట్టాగే రెచ్చిపోదాం’, ‘బాహుబలి’లోని ‘మనోహరి’, ‘ఊపిరి’లోని ‘డోరు నంబరు’ తదితర ప్రత్యేక గీతాల్లో నర్తించి, అలరించింది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే చారిత్రక కథాంశంతో ‘హరి హర వీరమల్లు’ రూపొందుతోంది. ఎ. ఎం. రత్నం సమర్పణలో దయాకర్‌ రావు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ సగానికిపైగా పూర్తయింది. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, మాటలు: సాయి మాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని