‘యానిమల్‌’ అనుబంధాలు గందరగోళంగా..

రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తున్న కొత్త చిత్రం ‘యానిమల్‌’. సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో పరిణీతి చోప్రా, అనిల్‌ కపూర్‌, బాబీ

Published : 26 Jan 2021 14:53 IST

ముంబయి: రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తున్న కొత్త చిత్రం ‘యానిమల్‌’. సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో పరిణీతి చోప్రా, అనిల్‌ కపూర్‌, బాబీ దేవోల్‌ కీలక పాత్రధారులు. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రానున్న ఈ చిత్రంలోని పాత్రల మధ్య అనుబంధాలు గందరగోళంగా ఉంటాయట. కథానాయకుడు ఎలాంటి పరిస్థితుల్లో మృగంలా మారాడు అనేది చిత్రంలో కీలకమైన అంశమట.

తాజాగా ఈ చిత్రంలోని పాత్రలకు సంబంధించిన విషయాలు బయటకొచ్చాయి. ఇందులో రణ్‌బీర్‌కపూర్‌ భార్యగా పరిణీతి కనిపించబోతుందని సమాచారం. వ్యాపార రంగంలో దూసుకుపోతున్న ఓ తండ్రి పాత్రలో అనిల్‌కపూర్‌, ప్రతినాయకుడిగా బాబీ దేవోల్‌ నటించనున్నట్టు బాలీవుడ్‌ వర్గాలు అనుకుంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని