40 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు.. స్టార్‌ హీరో ఎవరో తెలియదన్నాడు

నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఉంటూ, అదే రంగానికి చెందిన స్టార్‌హీరో ఎవరో తెలియదంటూ ఓ సీనియర్‌ నటుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి. పరిశ్రమలోనే కొనసాగుతున్నప్పటికీ...

Updated : 08 Aug 2022 11:16 IST

సీనియర్‌ నటుడి వీడియో వైరల్‌.. నెటిజన్లు ఫైర్‌

ముంబయి: నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఉంటూ, అదే రంగానికి చెందిన స్టార్‌హీరో ఎవరో తెలియదంటూ ఓ సీనియర్‌ నటుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి. పరిశ్రమలోనే కొనసాగుతున్నప్పటికీ తాను అస్సలు సినిమాలు చూడనంటూ ఆయన చెప్పడంపై నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. ‘‘ఇండస్ట్రీలో ఉన్న స్టార్‌ హీరోల గురించే తెలియనప్పుడు, ఇక్కడుండి ఏం లాభం’’ అంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు. ఇంతకీ ఆ సీనియర్‌ నటుడెవరు? ఆయన తెలియదని చెప్పిన స్టార్ ఎవరు?

‘ఉత్సవ్‌’, ‘మిస్టర్‌ ఇండియా’, ‘తేజాబ్’, ‘రామ్‌ లఖన్‌’, ‘హమ్‌’, ‘డర్‌’ వంటి బాలీవుడ్‌ (Bollywood) చిత్రాలతో సహాయనటుడు, కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్‌ నటుడు అన్నూ కపూర్‌ (Annu kapoor). ఆయన కీలకపాత్రలో నటించిన ‘క్రాష్‌ కోర్స్‌’ (Crash Course) అనే వెబ్‌ సిరీస్‌ ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime) వేదికగా విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ ఎవరో తనకు తెలియదంటూ అన్నూ కపూర్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ‘‘సర్‌.. ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) నటించిన ‘లాల్‌సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక సీనియర్‌ నటుడిగా ఆ సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు?’’ అని ప్రశ్నించగా.. ‘‘ఇంతకీ ఆ సినిమా ఏంటి? సాధారణంగా నేను సినిమాలు చూడను. కాబట్టి ఆ సినిమా గురించి నాకు తెలియదు’’ అని అన్ను సమాధానమిచ్చాడు. అన్ను మాటలతో కంగుతిన్న ఆయన వ్యక్తిగత మేనేజర్‌ మీడియాని దృష్టిలో ఉంచుకుని ‘‘నో కామెంట్స్‌’’ అని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అయితే మేనేజర్‌ వ్యాఖ్యలతో ఏకీభవించని అన్ను వెంటనే.. ‘‘ఇది నో కామెంట్స్‌ అని సమాధానం చెప్పాల్సిన ప్రశ్న కాదు. నేను నటించిన చిత్రాలైనా, లేదా బయటవారివైనా.. ఏదైనా సరే నేనస్సలు సినిమాలు చూడను. నిజం చెప్పాలంటే మీరు అడుగుతున్న ఆ నటుడెవరో కూడా నాకు తెలియదు. అలాంటప్పుడు ఆయన గురించి నేనెలా మాట్లాడగలను’’ అని వివరణ ఇచ్చారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారడంతో దీన్ని చూసిన వారు అన్ను తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘బాలీవుడ్‌ స్టార్‌ హీరోనే నీకు తెలియనప్పుడు ఈ ఇండస్ట్రీలో ఎలా ఉన్నావు?’’,  ‘‘సినిమాలు చూడవు, స్టార్‌హీరో ఎవరో తెలియదు.. అలాంటప్పుడు సినిమా పరిశ్రమలో ఉండాల్సిన అవసరం ఏముంది?’’, ‘‘ఇప్పటివరకూ ఇలాంటి రియాక్షన్‌ ఎప్పుడూ చూడలేదు’’ అని కామెంట్లు చేస్తున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని