Anurag Kashyap: బాలీవుడ్‌ నుంచి వెళ్లిపోవాలనుకున్నా: అనురాగ్‌ కశ్యప్‌

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. విమర్శలపై మాట్లాడారు.

Published : 13 Aug 2023 17:23 IST

ముంబయి: నెగెటివిటీ కారణంగా ఒకానొక సమయంలో బాలీవుడ్‌ వదిలి వెళ్లిపోవాలనుకున్నానని దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌(Anurag Kashyap) అన్నారు. నెగెటివిటీ వల్ల తాను ఎంతో ఇబ్బందిపడ్డానన్నారు. అన్నింటినీ ఎదుర్కొని తాను ఇంకా ఫిల్మ్‌ మేకింగ్‌లోనే కొనసాగడం ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘2021 కంటే ముందు రెండేళ్లపాటు నేను వ్యతిరేకత ఎదుర్కొన్నా. ప్రతికూల వాతావరణం వల్ల ఎంతో ఇబ్బందిపడ్డా. ఎక్కడికైనా వెళ్లిపోవాలనిపించింది. దక్షిణాదిలో నాకు మంచి స్నేహితులు ఉన్నారు. తమిళం, మలయాళం భాషల్లో సినిమాలు చేయడానికి రమ్మని ఎన్నోసార్లు ఆహ్వానించారు. జర్మనీ, ఫ్రెంచ్‌ పరిశ్రమల నుంచీ నాకు అవకాశాలు వచ్చాయి. భాషాపరమైన ఇబ్బందుల కారణంగా నేను వాటిని అంగీకరించలేకపోయా. విమర్శలు అన్నింటినీ ఎదుర్కొని ఇప్పటికీ ఈ రంగంలోనే కొనసాగుతున్నందుకు ఆనందంగా ఉన్నా. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా విమర్శించినా నేను పెద్దగా పట్టించుకోను. ఇప్పడు ఎదుటివారి విమర్శలు నన్ను ఏమాత్రం బాధపెట్టడం లేదు. వాళ్లు ఏం మాట్లాడినా.. నా పని నేను చేసుకుంటూ వెళ్లిపోతా’’ అని ఆయన చెప్పారు.

‘బ్లాక్‌ ఫ్రైడే’, ‘నో స్మోకింగ్‌’, ‘బాండే వెల్వెట్’, ‘దోబారా’ వంటి చిత్రాలకు అనురాగ్‌ దర్శకత్వం వహించారు. సన్నీలియోనీ, రాహుల్‌ భట్‌తో ఆయన తెరకెక్కించిన చిత్రం ‘కెన్నెడీ’ విడుదలకు సిద్ధంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని