Hrithik Roshan: రెండోపెళ్లి చేసుకోనున్న హృతిక్‌..?

బాలీవుడ్‌ స్టార్‌హీరో హృతిక్‌రోషన్‌ మరోసారి వివాహబంధంలోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. పరస్పర అంగీకారంతో 2014లో సుస్సన్నే ఖాన్‌ నుంచి హృతిక్‌ విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ నటి సబా ఆజాద్‌త....

Updated : 11 Mar 2022 13:20 IST

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌హీరో హృతిక్‌రోషన్‌ మరోసారి వివాహబంధంలోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. పరస్పర అంగీకారంతో 2014లో సుస్సన్నే ఖాన్‌ నుంచి హృతిక్‌ విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ నటి సబా ఆజాద్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. దీంతో వీరు కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. గత కొన్నిరోజులుగా ముంబయిలోని ప్రముఖ రెస్టారెంట్లకు డిన్నర్‌ డేట్స్‌కు వెళ్తున్నారు. దీంతో ఈ జంట ఇటీవల కెమెరా కంట పడటంతో వీళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. కాగా, తాజా సమాచారం ప్రకారం హృతిక్‌ - సబా త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హృతిక్‌ రోషన్‌.. తన కుటుంబ సభ్యులు, పిల్లలకు సబా ఆజాద్‌ని పరిచయం చేయగా.. వాళ్లందరికీ ఆమె బాగా నచ్చిందట. మాజీ సతీమణి సుస్సన్నేఖాన్‌ కూడా సబాతో సన్నిహితంగా ఉంటోందట. సమయం దొరికినప్పుడల్లా సబా.. హృతిక్‌ ఇంట్లో వాలుతుందోట. హృతిక్‌ కుటుంబంతో సబా కలిసి ఉన్న పలు ఫొటోలు సైతం ఇటీవల బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు వైరల్‌గా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని