Alia Ranbir: వివాహ సందడి షురూ

బాలీవుడ్‌ ప్రేమ జంట రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ వివాహ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఇందులో భాగంగా ముంబయిలోని రణ్‌బీర్‌ నివాసం ‘వాస్తు’లో బుధవారం ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో మెహందీ వేడుక సందడిగా జరిగింది.

Updated : 14 Apr 2022 09:11 IST

బాలీవుడ్‌ ప్రేమ జంట రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ వివాహ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఇందులో భాగంగా ముంబయిలోని రణ్‌బీర్‌ నివాసం ‘వాస్తు’లో బుధవారం ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో మెహందీ వేడుక సందడిగా జరిగింది. దీనికి ఇరువైపులా బంధువులు, స్నేహితులు, బాలీవుడ్‌ ప్రముఖులు తరలి వచ్చారు. 43 ఏళ్ల క్రితం రణ్‌బీర్‌ తల్లిదండ్రులు నీతూ కపూర్‌, రిషి కపూర్‌ల నిశ్చితార్థం జరిగిన రోజునే వీరి మెహందీ వేడుక జరగడం విశేషం. ఈ సందర్భంగా తన నిశ్చితార్థం ఫొటోను నీతూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. రణ్‌బీర్‌, ఆలియాల వివాహం గురువారం అత్యంత సన్నిహితుల మధ్య జరగనుందని తెలుస్తోంది.

‘బ్రహ్మాస్త్ర’ పెళ్లి కానుక

వివాహ బంధం ద్వారా ఒక్కటి కానున్న రణ్‌బీర్‌, ఆలియాలకు ‘బ్రహ్మాస్త్ర’ చిత్రబృందం అద్భుతమైన కానుక ఇచ్చింది. వారు జంటగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఓ ప్రేమ గీతం ప్రోమోను విడుదల చేశారు. రొమాంటిక్‌ గీతంలో ఈ జంట చూడముచ్చటగా ఉంది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 9న విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని