RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి బ్రెజిల్‌ అధ్యక్షుడి ప్రశంసలు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలై ఏడాదిన్నర పూర్తైనా.. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పోటెత్తుతూనే ఉన్నాయి. తాజాగా బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయీస్‌ ఇనాసియో లూల డ సిల్వా ఆ అభిమానుల జాబితాలో చేరారు.

Updated : 11 Sep 2023 14:05 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలై ఏడాదిన్నర పూర్తైనా.. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పోటెత్తుతూనే ఉన్నాయి. తాజాగా బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయీస్‌ ఇనాసియో లూల డ సిల్వా ఆ అభిమానుల జాబితాలో చేరారు. జీ20 సదస్సు కోసం భారత్‌కి వచ్చిన ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆకట్టుకునే సన్నివేశాలున్నాయి. కథానాయకుల డ్యాన్స్‌ అద్భుతం. భారతీయులపై బ్రిటీష్‌ దౌర్జన్యాలను నియంత్రణ పాటిస్తూ చూపించారు. విమర్శలు అర్థవంతంగా ఉన్నాయి. నేను తెలిసిన వాళ్లందరినీ ఈ చిత్రం చూడమని చెబుతున్నాను. ఈ సినిమాని చాలా ఆస్వాదించాను. దర్శకుడు, నటీనటులకు నా అభినందనలు’ అని చెప్పారాయన. దీనిపై రాజమౌళి స్పందిస్తూ.. ‘భారతీయ సినిమాను ప్రస్తావించడం, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను ఎంజాయ్‌ చేశానని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు సార్‌’ అని సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని