Ranveer Singh: ఇద్దరు రణ్‌వీర్‌ల ‘సర్కస్‌’

రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కస్‌’. పూజా హెగ్డే, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, వరుణ్‌ శర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 11 May 2022 08:16 IST

రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కస్‌’. పూజా హెగ్డే, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, వరుణ్‌ శర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్‌లోని ప్రముఖ హాస్యనటులంతా ఇందులో నటిస్తుండటం విశేషం. చిత్ర ఫస్ట్‌ లుక్‌ను దర్శకుడు రోహిత్‌ శెట్టి ఇన్‌స్టాలో మంగళవారం విడుదల చేశాడు. క్రిస్‌మస్‌ కానుకగా ఈ ఏడాది డిసెంబరు 23న విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది. 1982లో గుల్జార్‌ దర్శకత్వంలో వచ్చిన కామెడీ క్లాసిక్‌ చిత్రం ‘అంగూర్‌’ స్ఫూర్తితో రోహిత్‌ ‘సర్కస్‌’ను తెరకెక్కిస్తున్నారు. ‘సర్కస్‌’లో ఇద్దరు రణ్‌వీర్‌లు ఉంటారని ఫస్ట్‌లుక్‌తో తెలుస్తోంది. టి సిరీస్‌ సమర్పణలో రోహిత్‌ శెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రణ్‌వీర్‌ ‘జయేశ్‌భాయ్‌ జోర్దార్‌’ శుక్రవారం విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని