పోస్టుల డిలీట్.. దీపికాకు ఏమైంది?

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె కొత్త ఏడాదిలో మొదటిరోజునే తన అభిమానులందరికీ షాకిచ్చారు. తరచూ సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే దీపిక.. ఉన్నట్టుండి తన ట్విటర్‌, ఇన్‌స్టా ఖాతాల్లో ఉన్న కొన్ని వందల పోస్టుల్ని ఒకేసారి డిలీట్‌ చేసేశారు....

Published : 01 Jan 2021 14:15 IST

షాక్‌లో అభిమానులు

ముంబయి: బాలీవుడ్‌ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె కొత్త ఏడాది మొదటిరోజునే తన అభిమానులకు షాకిచ్చారు. తరచూ సోషల్‌మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే దీపిక.. ఉన్నట్టుండి తన ట్విటర్‌, ఇన్‌స్టా ఖాతాల్లో ఉన్న కొన్ని వందల పోస్టుల్ని ఒకేసారి డిలీట్‌ చేసేశారు. అయితే, దీనికి గల కారణం ఇంకా తెలియరాలేదు. దీంతో అభిమానులు.. దీపికాకు ఏమైంది? పోస్టులు ఎందుకు డిలీట్‌ చేసింది? అంటూ ట్విటర్‌ వేదికగా వరుస ట్వీట్లు పెడుతున్నారు.

నూతన సంవత్సర వేడుకలను జరుపుకొనేందుకు గత కొన్నిరోజుల క్రితం దీపిక తన భర్త రణ్‌వీర్‌తో కలిసి జైపుర్‌కు వెళ్లారు. రణ్‌బీర్‌-ఆలియాభట్‌ కుటుంబాలతో కలిసి రణ్‌వీర్‌-దీపిక దంపతులు అక్కడ న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకొంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సైతం రణ్‌వీర్‌ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇలాంటి సమయంలో దీపిక పోస్టులు డిలీట్‌ చేయడంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

2010లో ట్విటర్‌లోకి అడుగుపెట్టిన దీపికను ఇప్పటివరకూ 27.7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అలాగే ఇన్‌స్టాలో ఆమెకు 52.5 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.

ఇవీ చదవండి

క్రాక్‌ ట్రైలర్‌ వచ్చేసింది..!

కలలన్నీ నిజం కావాలి.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ రావాలి..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని