RC15: రామ్‌చరణ్‌- శంకర్‌ల మూవీ ఫొటోలు లీక్‌.. నిర్మాత ఏమన్నారంటే..!

రామ్‌ చరణ్‌ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ సోమవారం రాజమండ్రిలో ప్రారంభమైంది. వారం పాటు సాగే చిన్న షెడ్యూల్‌ ఇది. అందులో రామ్‌చరణ్‌ పాత్రకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ చిత్రీకరిస్తున్నారు.

Published : 13 Oct 2022 01:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌చరణ్‌(Ramcharan) కథానాయకుడిగా శంకర్‌(Shankar) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇంకా పేరు ఖరారు కానీ ఈ సినిమాను RC15గా పిలుస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా రానున్న ఈ సినిమాకు ఒక కొత్త ఇబ్బంది ఎదురైనట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ సోమవారం రాజమండ్రిలో ప్రారంభమైంది. వారం పాటు సాగే చిన్న షెడ్యూల్‌ ఇది. అందులో రామ్‌చరణ్‌ పాత్రకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రీకరణకు సంబంధించిన ఫొటోలు లీక్‌ అయ్యాయి. అవి నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలిసి నిర్మాత దిల్‌రాజు దానిపై దర్యాప్తు చేయాల్సిందిగా చిత్ర బృందాన్ని కోరారట. రామ్‌ చరణ్‌ సరసన కియారా అడ్వాణీ నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్‌, అంజలి, ఎస్.జె.సూర్య, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.రాజకీయ నేపథ్యమున్న యాక్షన్‌ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాకు తమన్‌ స్వరాలందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని