‘మింత్రా’తో విజయ్‌ దేవరకొండ ‘రౌడీ’‌

ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్‌ పేరుతో ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఏడాదిన్నర కిందట ప్రారంభించిన ఈ రౌడీ వేర్‌ బ్రాండ్‌కు ఫ్యాషన్‌ ప్రియుల్లో క్రేజ్‌ రోజురోజుకీ పెరుగుతోంది. తన రౌడీ...

Published : 12 Feb 2020 00:37 IST


హైదరాబాద్‌: ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్‌ పేరుతో ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఏడాదిన్నర కిందట ప్రారంభించిన ఈ రౌడీ వేర్‌ బ్రాండ్‌కు ఫ్యాషన్‌ ప్రియుల్లో క్రేజ్‌ రోజురోజుకీ పెరుగుతోంది. తన రౌడీ బ్రాండ్‌ను ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ వేదిక మింత్రాతో కలిసి విక్రయించేందుకు విజయ్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తన బృందంతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ.. ముగ్గురు మిత్రులతో కలిసి ఫ్యాషన్ రంగంలోకి అడుగు పెట్టానన్నారు. తమ రౌడీ బ్రాండ్‌ దుస్తులను దేశవ్యాప్తంగా పరిచయం చేసేందుకు మింత్రాతో కలిసి ముందడుగు వేశామన్నారు. ఈ సందర్భంగా రౌడీవేర్ నుంచి తయారు చేసిన రకరకాల దుస్తులను అభిమానులకు స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చి విజయ్‌తో ఫొటో దిగేందుకు పోటీపడ్డారు.

ఫొటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి...
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని