ఇందిరగా ‘దంగల్‌’ భామ

‘దంగల్‌’ భామ ఫాతిమా సనాషేక్‌ అరుదైన అవకాశం దక్కించుకుంది. భారతీయ సైన్యం తొలి ఫీల్డ్‌ మార్షల్‌ మానెక్‌ షా జీవితం ఆధారంగా మేఘనా గుల్జార్‌ తెరకెక్కిస్తున్న ‘శామ్‌ బహదూర్‌’లో ఆమె ఉక్కు మహిళ, భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్ర పోషించనున్నట్టు సంతోషంగా ప్రకటించింది.

Updated : 14 Jun 2022 02:22 IST

‘దంగల్‌’ భామ ఫాతిమా సనాషేక్‌ అరుదైన అవకాశం దక్కించుకుంది. భారతీయ సైన్యం తొలి ఫీల్డ్‌ మార్షల్‌ మానెక్‌ షా జీవితం ఆధారంగా మేఘనా గుల్జార్‌ తెరకెక్కిస్తున్న ‘శామ్‌ బహదూర్‌’లో ఆమె ఉక్కు మహిళ, భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్ర పోషించనున్నట్టు సంతోషంగా ప్రకటించింది. ఇందిరాగాంధీ ఆహార్యం, హావభావాలు ఒంట పట్టించుకోవడం కోసం.. ఆమెకు సంబంధించిన పాత వీడియోలు, ఇంటర్వ్యూలు బాగా చూస్తున్నాననీ.. విపరీతంగా పుస్తకాలు చదువుతున్నానని చెప్పుకొచ్చింది సనా. ఇందులో విక్కీ కౌశల్‌ టైటిల్‌ పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు సనా తాప్సీ పన్నుతో కలిసి ‘ధక్‌ధక్‌’లోనూ కీలక పాత్రలో నటిస్తోంది.


యాక్షన్‌ కా ‘బాప్‌’

బాలీవుడ్‌లో మరో భారీ యాక్షన్‌ చిత్రం తెరకెక్కబోతోంది. ఇది అన్ని యాక్షన్‌ చిత్రాలను తలదన్నేలా ఉంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. సన్నీ డియోల్‌, సంజయ్‌దత్‌, జాకీ ష్రాఫ్‌, మిథున్‌ చక్రవర్తిలు కలిసి ఇందులో పోరాటాలు చేయబోతున్నారు. జీ స్టూడియోస్‌, అహ్మద్‌ ఖాన్‌లు నిర్మించే ఈ చిత్రానికి దర్శకుడు వివేక్‌ చౌహాన్‌. దీనికి ‘బాప్‌’ అనే టైటిల్‌ ఖరారు చేస్తున్నట్టు చిత్రవర్గాలు ఆదివారం ప్రకటించాయి. జూన్‌ 14 నుంచి ముంబయిలో తొలి షెడ్యూల్‌ ప్రారంభం కానున్నట్టు తెలిపాయి. 2023 ద్వితీయార్థంలో విడుదల చేస్తామని ప్రకటించారు. కథానాయిక, ఇతర సాంకేతికవర్గం వివరాలు తెలియజేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని