Guntur Kaaram: సర్రు మండుతాది బాబు కారం!

‘గుంటూరు కారం’ ఘాటుతో పసందైన దమ్‌ మసాలా బిర్యానీ వడ్డించేందుకు సిద్ధమవు  తున్నారు మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌.

Updated : 08 Nov 2023 14:03 IST

‘గుంటూరు కారం’ ఘాటుతో పసందైన దమ్‌ మసాలా బిర్యానీ వడ్డించేందుకు సిద్ధమవు  తున్నారు మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌. ఈ ఇద్దరి కలయికలో రూపొందుతోన్న ఈ మాస్‌ యాక్షన్‌ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. మంగళవారం త్రివిక్రమ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి తొలి గీతాన్ని విడుదల చేశారు. ‘‘సర్రు మండుతాది బాబు గొడ్డు కారం.. గిర్ర తిరుగుతాది ఈడి తోటి బేరం’’ అంటూ సినిమాలో మహేశ్‌బాబు పాత్రను ఆవిష్కరిస్తూ సాగే పాటిది. ‘‘నా తలరాతే రంగుల రంగోలి. దిగులైనా చేస్తా దీవాలి. నా నవ్వుల కోటని నేనే ఎందుకు పడగొట్టాలి’’, ‘‘నేనో నిశ్శబ్దం.. అనునిత్యం నాతో నాకే యుద్ధం’’ అంటూ పాటలో వినిపించిన కొన్ని పదాలు మహేశ్‌   పాత్ర లోతుని తెలియజేస్తున్నాయి. తమన్‌ బాణీలు సమకూర్చిన ఈ గీతానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించగా.. సంజిత్‌ హెగ్డే, జ్యోతి నూరన్‌ ఆలపించారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని