Guntur kaaram: నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే

‘నా చెంపలకంటిన చామంతి సిగ్గు నువ్వే నువ్వే...’ అంటూ కథానాయకుడు మహేశ్‌బాబుని పాటతో ఆరాధిస్తోంది శ్రీలీల. ఇదంతా ‘గుంటూరు కారం’ చిత్రం కోసమే! అందమైన ఈ జంట ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

Updated : 14 Dec 2023 09:24 IST

‘నా చెంపలకంటిన చామంతి సిగ్గు నువ్వే నువ్వే...’ అంటూ కథానాయకుడు మహేశ్‌బాబుని పాటతో ఆరాధిస్తోంది శ్రీలీల. ఇదంతా ‘గుంటూరు కారం’ చిత్రం కోసమే! అందమైన ఈ జంట ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో తెలియాలంటే చిత్రం చూడాల్సిందే. మహేశ్‌బాబు కథానాయకుడిగా హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రమిది. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మాత. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది.  ఓ మై బేబీ... అంటూ సాగే ఈ సినిమాలోని పాటని బుధవారం విడుదల చేశారు. తమన్‌ స్వరకల్పనలోని ఈ పాటని, రామజోగయ్య శాస్త్రి రచించగా, శిల్పారావు ఆలపించారు.

‘నా బాల్కని గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే... ఏ నూటికి కోటికో నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే... నే పుట్టిన వెంటనే గుట్టుగా నీకు పెళ్లామయ్యాలే... ఓ మై బేబీ నీ పక్కన వాలాలి... నీతో చుక్కలు చూడాలి... నీ కౌగిలి ఖాళీ పూరించాలి...’ అంటూ ఈ పాట మంచి మెలోడీ బాణీతో సాగుతుంది. త్రివిక్రమ్‌ - తమన్‌ కలయికలో వచ్చిన చిత్రాలకి సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈచిత్రం కూడా ఆ అంచనాలకి దీటుగా ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి. రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని