Prabhas: జులై నుంచి ప్రేమలో..

ప్రభాస్‌ ప్రేమకథకి ముహూర్తం కుదిరింది. జులై నుంచే ఆయన కొత్త ప్రేమాయణం మొదలు కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ పక్కాగా సిద్ధమైనట్టు సినీ వర్గాలు తెలిపాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో... అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాని నిర్మిస్తోంది.

Updated : 04 May 2024 09:34 IST

ప్రభాస్‌ ప్రేమకథకి ముహూర్తం కుదిరింది. జులై నుంచే ఆయన కొత్త ప్రేమాయణం మొదలు కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ పక్కాగా సిద్ధమైనట్టు సినీ వర్గాలు తెలిపాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో... అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాని నిర్మిస్తోంది. ప్రేమ ప్రధానంగా సాగే పీరియాడిక్‌ యాక్షన్‌ కథతో ఈ చిత్రం రూపొందనున్నట్టు సమాచారం. ‘సీతారామం’ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. కథానాయిక ఎంపిక ప్రక్రియ కూడా ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. పాటల పనులు కూడా కొనసాగుతున్నట్టు తెలిసింది. ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘కల్కి 2898 ఎ.డి’ జూన్‌ 27న విడుదల కానుంది. ఆ హంగామా మధ్యే కొత్త సినిమా కోసం రంగంలోకి దిగనున్నారు ప్రభాస్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని