Kannappa: ‘కన్నప్ప’లో అక్షయ్‌ పని పూర్తి

‘కన్నప్ప’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు మంచు విష్ణు. ఆయన టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్నారు. మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

Updated : 04 May 2024 09:39 IST

‘కన్నప్ప’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు మంచు విష్ణు. ఆయన టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్నారు. మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయన ఇటీవలే ఈ చిత్ర సెట్స్‌లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయినట్లు చిత్ర బృందం శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు అక్షయ్‌తో దిగిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు మంచు విష్ణు. ‘‘అక్షయ్‌ కుమార్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైనది. ఇలా ఇంకా ఎన్నోసార్లు కలవాలని కోరుకుంటున్నా’’ అంటూ తన పోస్ట్‌కు ఓ వ్యాఖ్యను కూడా జోడించారు విష్ణు. అక్షయ్‌ ఈ చిత్రంలో శివుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. నందీశ్వరుడి పాత్రను ప్రభాస్‌ పోషించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని